- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ - ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసిన నటిస్తున్న వార్ 2 సినిమా ప్రస్తుతం వార్తలలో ఉంది. మే 24 ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తారాగణం .. రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్సిటీలో భాగంగా ఈ సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 2026 లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్‌ 2 లో హృతిక్ రోషన్ మళ్ళీ కబీర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ కి 48 కోట్ల పారితోష‌కం లభించింది అని సమాచారం. అలాగే మన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వర్క్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.


ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఎన్టీఆర్కు 30 కోట్ల రెమ్యూనరేషన్ లభిస్తోంది. ఇక వార్ 2లో కీయారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందుకుగాను ఆమెకు 15 కోట్లు ముడుతోందట. వార్ 2 లో షబ్బీర్ అహ్లువాలియా కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం 35 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా ఆయనకు 32 కోట్ల పారితోష‌కం లభించ‌దని సమాచారం. అలాగే వార్ 2లో జాన్ అబ్రహం ప్రత్యేక‌క పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఆయనకు ఎంత పరిదోషం ఇస్తున్నారు అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: