
ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మనోజ్ స్పీచ్ హైలెట్ గా మారింది. ముఖ్యంగా స్టేజ్ పై తన ఏవి ప్రదర్శిస్తున్న సమయంలో మనోజ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. సొంతవారే దూరం పెడుతున్న రోజుల్లో ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి చలించిపోయిన మంజు మనోజ్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. పక్కనే ఉన్న డైరెక్టర్ విజయ్ కనకమేడల, హీరో నారా రోహిత్ ఓదారుస్తున్నా.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అనంతరం స్టేజ్ పై మంచు మనసు మాట్లాడుతూ.. `తెరపై కనిపించి తొమ్మిది ఏళ్లు గడిచిపోయింది. వ్యక్తిగత కారణాలతో కొన్ని సినిమాలను స్టార్ట్ చేసి ఆపేసాను. సినిమా తప్ప నాకేం తెలీదు. 9 ఏళ్ల గ్యాప్ వచ్చిన అభిమానుల ప్రేమలో మాత్రం ఏ మార్పు లేదు. ఆ ప్రేమకు నేను సినిమాతోనే సమాధానం ఇస్తాను` అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. `కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టారు. ఊరెళ్ళి వచ్చేసరికి పిల్లల వస్తువులతో సహా అన్ని బయటపెట్టారు. కార్లు కూడా తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలోనూ శివుడి రూపంలో వచ్చి అభిమానులే అండగా నిలిచారు. ఇంటి ముందు 20 కార్లు పెట్టించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు వేసిన ఎవరి మీద నాకు కోపం రావడం లేదు. బాధ ఒక్కటే కలుగుతుంది. అది నా బలహీనతో.. లేక వారి బలమో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ జన్మకి నా కంటికి కాలే వరకు నేను మోహన్ బాబు అబ్బాయినే. దాన్ని ఎవరూ మార్చలేరు. నీతి వైపు నిలబడాలని ఆ తండ్రి నేర్పించారు. అదే ఫాలో అవుతాను` అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు.
ఇక పనిలో పనిగా మంచు విష్ణు పై కూడా మనోజ్ కౌంటర్ వేశారు. `శివయ్య అని పిలిస్తే ఆ శివుడు రాడు.. మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటే మా డైరెక్టర్‌లానో, మా నిర్మాతలానో వస్తాడు. మా మీద నమ్మకంతో రూ. 50 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు` అంటూ మనోజ్ పరోక్షంగా విష్ణుపై సెటైర్ వేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.