
దేవర సినిమా సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. మరికొన్ని గంటల్లో వార్2 సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రానుందనే సంగతి తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు వార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా వార్2 సినిమాలో తారక్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. వార్ సినిమాకు సీక్వెల్ గా వార్2 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వార్2 సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అధుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సంతోషంగా మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లకు ఓకే చెబుతున్న ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతూ ఉండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.