రాశి కన్నా ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. తెలుగులో అనేక సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈ భామ తెలుగులో ఓవైపు నటిస్తూనే మరోవైపు హిందీలో కూడా అవకాశాలను అందుకుంది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ అభిమానుల మనసులను దోచుకుంటుంది. 

భామ ఒకప్పుడు ఎంతో బొద్దుగా, ముద్దుగా, కుందనపు బొమ్మలా కనిపించేది. ప్రస్తుతం ఈ చిన్నది పూర్తిగా బక్క చిక్కిపోయి ఎవ్వరు గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం రాశి కన్నా హిందీలో ఫర్జీ-2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే రాశి కన్నా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో తన ముఖం, చేతులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తనకు గాయాలు అయినటువంటి ఫోటోలను స్వయంగా రాశి కన్నా తన ఇన్ స్టా పోస్ట్ లో షేర్ చేసుకున్నారు. "కొన్ని రోల్స్ అడగవు కేవలం డిమాండ్ చేస్తాయి.


నీ శరీరం, శ్వాస గాయాలను అస్సలు లెక్కచేయకూడదు. నువ్వే ఓ తుఫాను అయినప్పుడు ఉరుములు నిన్ను ఏమి చేయలేవు కమింగ్ సూన్" అని క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం రాశి కన్నా షేర్ చేసుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన తన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాశి కన్నా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా రాశి ఎప్పటిలానే మళ్లీ తెలుగు సినిమాలలో నటించాలని తెలుగు సినీ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రాశి కన్నా తన అభిమానుల కోసం తెలుగులో సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: