గతంలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన పూనమ్ కౌర్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ పైన ఏదో ఒక విషయం పైన స్పందిస్తూ ఉంటుంది. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ పూనమ్ కౌర్ చేసేటటువంటి పోస్ట్లు మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్న పూనమ్ మా అసోసియేషన్ లో కూడా త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత అందుకు సంబంధించి విషయాలను మాత్రం తెలుపలేదు.


తాజాగా సోషల్ మీడియా వేదికగా పూనమ్ కౌర్ చేసిన ఒక పోస్ట్ ఇండస్ట్రీలో కుదిపేస్తోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు మరొకసారి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.. తాను త్రివిక్రమ్ తో ఉన్న సమస్యలను ఎప్పటికీ వదిలిపెట్టనని న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్టుని షేర్ చేశారు. అన్ని ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని త్వరలోనే ఖచ్చితమైన ఆధారులతో తెలియజేస్తానంటూ తెలియజేసింది. అలాగే ఒక బడా పొలిటిషన్ కూడా త్రివిక్రమ్ వెనుక ఉన్నారనే విధంగా ఆరోపణలు చేసినట్లు సమాచారం.


పూనమ్ కౌర్ చేసిన తాజా వ్యాఖ్యలు  అటు సిని ఇండస్ట్రీలో అభిమానుల పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. మరి ఈ విషయం పైన అటు త్రివిక్రమ్ కానీ తన టీమ్ కానీ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది .కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన ఎప్పుడు స్పందించలేదు త్రివిక్రమ్. పూనమ్ కౌర్ తెలుగు ,తమిళ సినిమాలలో కూడా నటించింది. తెలుగులో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటించిన పూనమ్ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ పొలిటికల్ పరంగా బిజీగా ఉన్నది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తెలుగు సినీ పరిశ్రమలోకి పూనమ్ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: