చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర హీరోల ఆస్తులు సామాన్య జనాలకు ఎప్పుడు కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి .. అయితే ఇంకొన్ని విషయాలు తెలిసినప్పుడు అంతకుమించి షాక్ తగిల‌నట్టు కూడా ఉంటుంది .. ఇది కూడా అలాంటిదే .. స్టార్ హీరో ఎన్టీఆర్‌కు ప్రైవేట్ జెట్ విమానం ఉంది అనేది ఆ న్యూస్ .. ఎన్టీఆర్ కు చాలా ఆస్తులు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే .. దాదాపు 450 కోట్ల రూపాయల నెట్ వర్త్‌ అయిన దగ్గర ఉంది .  అలాగే ఖరీదైన వాచ్లు కార్లు ఆయన దగ్గర ఉన్నాయని విషయం అందరికీ తెలుసు .  అయితే ఇక్కడ ఎన్టీఆర్‌కు ఓ ప్రైవేట్ జాట్ విమానం ఉంది అని బాలీవుడ్ మీడియా అంటుంది .


హృతిక్ తో కలిసి వార్ 2  సినిమా చేస్తున్న ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా దుష్టి పెట్టారు బాలీవుడ్ మీడియా వారు .. అందులో భాగంగానే అతని ఆస్తులు వివరాలని బయటకు తీస్తుంది .  ఈ క్రమంలోనే అతనికి 80 కోట్ల విలువైన ప్రైవేట్ జాట్‌ విమానం ఉందంటూ ప‌లు కథనాలను కూడా రాసుకువస్తుంది .. అయితే తన సినిమా ప్రమోషన్లకు కుటుంబంతో విహారయాత్రకు ఈ జట్‌ను ఎన్టీఆర్ వాడుతారు అంటూ కూడా బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది ..



అలాగే ఎన్టీఆర్‌కు ఖరీదైన బంగ్లాలు , విల్లాలు ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి .. అదేవిధంగా ఐదు కోట్ల విలువైన లాంబోర్గిని , రెండు కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి .. వీటితో పాటు బీఎండబ్ల్యూ , ఫోర్షే లాంటి కార్లు కూడా ఉన్నాయి .. ఇలా ఎన్టీఆర్ ఆస్తుల పై జనాలకు ఐడియా ఉంది కానీ ఈ ప్రైవేట్ జ‌ట్ విష‌యం మాత్రం చాలా మందికి పెద్దగా తెలియదు .. ఆయన గురించి ఇంకా ప్రైవేట్ జ‌ట్ ఉందా అనే విషయం పై ఎవరికీ క్లారిటీ లేదు . అయితే బాలీవుడ్ మీడియా మాత్రం అది ఉంది అంటూ కోడైకొస్తుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: