సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం కూలీ మరియు జైలర్ 2 అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కూలీ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే జైలర్ 2 మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. జైలర్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో జైలర్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన బ్యూటీలాలో ఒకరు అయినటువంటి విద్యా బాలన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , విద్యా బాలన్ పాత్ర నిడివి ఈ సినిమాలో కాస్త తక్కువే ఉన్నప్పటికీ కథ మొత్తాన్ని మలుపు తిప్పే మెయిన్ పాత్రలో ఈ బ్యూటీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జైలర్ 2 మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటి అయినటువంటి విద్యా బాలన్ నటించడం ద్వారా ఈ సినిమాపై హిందీ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడతాయి అందుకే జైలర్ 2 మూవీ లో కీలక పాత్రలో విద్యా బాలన్ ను మేకర్స్ తీసుకొనే ఆలోచనలో ఉండి ఉంటారు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్త పరుస్తూ వస్తున్నారు. ఏదేమైనా కూడా జైలర్ 2 మూవీ పై మాత్రం ఇండియా  వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: