
పి.వాసు డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ హారర్ కామెడీ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. జ్యోతిక టైటిల్ పాత్రను పోషించింది. ప్రభు, వడివేలు, నాసర్, షీలా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 2004లో విడుదలైన కన్నడ చిత్రం `ఆప్తమిత్ర`కు రీమేక్‌గా చంద్రముఖిని తెరకెక్కించారు. ప్రభు మరియు అతని సోదరుడు రామ్‌కుమార్ గణేషన్ కలిసి నిర్మించిన చంద్రముఖి.. 2005లో విడుదలై తమిళంలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
అలాగే ఈ సినిమా ఐదు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులు మరియు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అయితే తన స్నేహితుడైన ప్రభు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్లే రజనీకాంత్ చంద్రముఖి చేశారు. కట్ చేస్తే ఈ సినిమా విజయం రజనీకాంత్ కెరీర్ ను మరో మలుపు తిప్పింది.
ఇక తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన చంద్రముఖిని తెలుగులో చిరంజీవిని హీరోగా పెట్టి తీయాలని పి.వాసు భావించారు. చిరంజీవితో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ, ఆయన ఏమాత్రం ఆసక్తి చూపలేదు. దాంతో తమిళ చంద్రముఖిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రజనీకాంత్ ఇమేజ్ ను మరింత పెంచేసింది. ఏదేమైనా చంద్రముఖి తెలుగు రీమేక్ చిరు చేసుంటే బాగుండేదని మెగా ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.