
బర్తడే కేక్ విషయంలో పప్పు సిబ్బందికి నటి కల్పిక కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. చివరికి ఈ వివాదం పెద్దది అవ్వడంతో నటి పబ్ సిబ్బంది పైన పచ్చి బూతులతో రెచ్చిపోయి మరి మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నటి ఒక డ్రగ్లిస్ట్ అంటూ పబ్ నిర్వహకులు దాడి దిగినట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే పబ్ యజమాన్యం కూడా కలగజేసుకొని మరి ఇద్దరి మధ్య శాంతింప చేసినట్లు సమాచారం. కానీ నటి మాత్రం పప్ సిబ్బంది పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పబ్ లో జరుగుతున్న తీరును ఆమె ఎండగడుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. నటి కల్పిక కూడా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది. ఆమధ్య నటుడు అభినవ్ పైన పలు రకాల ఆరోపణలు చేసింది కల్పిక. ఇక ఈ నటికి కూడా అభినవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో తెలుగు ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయంశంగా మారింది. అయితే మళ్లీ సైలెంట్ అయినా కల్పిక ఇప్పుడు మరొకసారి ఈ వివాదంతో వైరల్ గా మారుతోంది.