ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస పెట్టి విజయాలు దక్కడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈమె ఇండియా వ్యాప్తంగా అనేక క్రేజీ సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తూ వెళుతుంది.

కొంత కాలం క్రితం రష్మిక మందన , సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన సికిందర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే ప్రస్తుతం రష్మిక చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా రష్మిక మందన మాట్లాడుతూ ... జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. అని దానిని అర్థం చేసుకొని జీవిస్తే జీవితం ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని రష్మిక మందన తాజాగా చెప్పుకొచ్చింది.

అలాగే నీకంటూ ఒక రోజు కచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం మారుతుంది. నేను కష్టాల్లో ఉన్న సమయంలో నా స్నేహితులు మరియు నా కుటుంబం నాకు అండగా ఉన్నారు. అది నా అదృష్టం నిజం చెప్పాలి. నిజం చెప్పాలంటే కూర్గ్ లాంటి ఒక చిన్న ప్రాంతం నుండి నేను ఇండస్ట్రీ కి వచ్చి ఇంత గొప్ప నాటిక ఎదుగుతాను అని ఎప్పుడూ అనుకోలేదు అంటూ తాజా ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక మందన చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: