
కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. సైలెంట్ గా తన పని తాను చూసుకునిపోతూ వస్తూ వచ్చాడు . అయితే అల్లు అర్జున్ తో ఒక సినిమాకు కమిటీ అయ్యి ఆ స్క్రిప్ట్ పనులను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉండిపోయాడు త్రివిక్రమ్ . కానీ సడన్గా అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అవ్వడంతో ఎవరు ఊహించని హీరోని పట్టేసుకున్నాడు త్రివిక్రమ్ . వెంకటేష్ తో యాక్షన్ కామెడీ ఎంటర్టైనను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఎప్పటినుంచో ఒక స్క్రిప్ట్ అనుకుని ఉన్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .
అంతే కాదు అనుకున్న విధంగానే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా తర్వాత వెంకటేష్ తన లైనప్ ను మార్చేశాడు . జనాలను ఎంటర్టైన్ చేసే విధంగానే సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు. ఇదే మూమెంట్లో త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో సెట్ అయిపోయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా బ్యాక్ గ్రౌండ్లో మాత్రం అన్ని పనులు చక్క చక్క జరిగిపోతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 14వ తేదీ సినిమా పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లు తెలుస్తుంది . అదేవిధంగా జూన్ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు త్రివిక్రమ అంటూ కూడా తెలుస్తుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసేసాడట త్రివిక్రమ్ . అంతేకాదు ఈ సినిమాలో త్రివిక్రమ్ - వెంకటేష్ క్యారెక్టర్ పేరు చాలా వెరైటీగా పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ పేరు "బ్రహ్మానందం" అని పెట్టారట. ఈ మూవీలో వెంకటేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందువల్ల క్యారెక్టర్ కి తగ్గట్టు కమెడియన్ బ్రహ్మానందం పేరు పెట్టినట్లు ఓ న్యూస్ సినీ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. మొత్తానికి అయితే ఈ పేరు వెంకటేష్ కి చాలా డిఫరెంట్ గా ఉండడమే కాదు హాస్యబ్రహ్మగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం లాంటి గొప్ప కమెడియన్ కి ఇచ్చిన గౌరవం కూడా అంటున్నారు జనాలు. అంతేకాదు ఈ క్యారెక్టర్ పేరు బట్టే సినిమా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు అంటూ సినిమాకి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చేస్తున్నారు..!!