
అలాగే మనం తినే కొన్ని ఆహార పదార్థాలు మన లావు పెరగడానికి కారణం అవుతూ ఉంటాయి .. అలాంటి వాటిలో మాంసం , చాక్లెట్ , ఐస్ క్రీమ్ , స్వీట్లు ఎంతో ముఖ్యమైనవి .. అలాగే వీటిని తినడం పూర్తిగా మానేసింది ఈ బ్యూటీ .. రోజు పసుపు నీరు , టీతో ఉదయాన్నే తన రోజును మొదలుపెట్టేది కూరగాయలు , పెసరపప్పు , మిరపకాయ లేదా దోశ మెంతి పరాఠాలు తీసుకునేది .. అలాగే ఈ ఆహార పద్ధతులు తన శరీరంలోని కొవ్వును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి .. అలాగే మధ్యాహ్నం భోజనంలో చిరుధాన్యాలు , సలాడ్లు , మొలకలు ,స్క్రాంబ్లింగ్ టోఫుతోపాటు బహుళ ధాన్యాల పిండితో చేసిన రోటీలు ఎక్కువగా తీసుకునేదట. లైట్‌గా నెయ్యి కూడా ఉండేది .
ఇక నైట్ డిన్నర్ కూడా తేలికపాటిగా ఎక్కువగా పెరుగు , బాటిల్ గార్డ్ సూప్ తినేదట .. నిద్రపోవడానికి కనీసం రెండు మూడు గంటలు ముందుగానే తన డిన్నర్ ముగించేదట .. ఇక అప్పుడప్పుడు నైట్ వేయించిన గుప్పెడు కాల్చిన మఖానా తినేదట .. ఇలా సాధారణంగా కొంతమంది బరువు తగ్గేటప్పుడు కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటారు .. అయితే ఈ నటి తనకు తానే స్ఫూర్తిగా నిలిచింది .. జిమ్లో వర్కౌట్లు కఠినమైన ఆహార నియమాలతో ఇలా ఆరు నెలల్లోని ఏకంగా 55 కేజీల బరువు తగ్గింది .. అలాగే గతంలో భారీ బరువుతో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సన్నగా ఎంతో అందంగా నా జుకుగా మారిపోయింది .. ప్రస్తుతం ఈమె ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది .. ఇంతకి ఈ బ్యూటీ మరెవరో కాదు .. షెహనాజ్ గిల్ .. ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి ..