రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బాలీవుడ్ లో ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొంది. అయితే ఈ పాడ్ కాస్ట్ లో రకుల్ కి ఒక ప్రశ్న ఎదురయ్యింది. మీ జీవితంలో మీకు ఎదురైనా ఒక వింత రూమర్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడగగా.. నా జీవితంలో వింత రూమర్ ఏదైనా ఉంది అంటే హైదరాబాదులో నేను నా కష్టార్జితంతో కొనుక్కున్న ఇల్లుని వేరేవాళ్లు గిఫ్ట్ గా ఇచ్చారనే రూమర్. ఈ రూమర్ విని మా నాన్న చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. వాట్ ఈజ్  దట్..ఏంటి ఈ రూమర్..ఇలా మాట్లాడుతున్నారు ఏంటి.. నువ్వు దీనిపై ఏమి స్పందించవా.. అంటూ నాపై ఫైర్ అయ్యారు.దాంతో నేను కూల్ గా నాన్నా అలాగే రూమర్స్ వస్తాయి. వాటిని పట్టించుకోకు అని చెప్పాను.అయినా కూడా మా నాన్న వినకుండా నువ్వు ఈ రూమర్లపై గట్టిగా స్పందించు.. 

లేకపోతే బాగోదు అని వార్నింగ్ ఇచ్చారు.కానీ నేను మా నాన్నకు సర్ది చెప్పి ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది అని చెప్పాను. ఇదే నా జీవితంలో వచ్చిన ఒక వింత రూమర్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తూ మా రామన్నకు సంబంధం ఏమీ లేదురా బాబు అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చారు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తుంది. అయితే గతంలో అంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్  హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో ఒక ఇల్లు కొనుక్కుంది.

అది కూడా తన సొంత డబ్బులతో. కానీ ఆ ఇల్లు కొన్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఓ బడా పొలిటిషియన్ ఇల్లు కొనిచ్చారని,ఆ పొలిటీషియన్ తో రకుల్ కి వేరే సంబంధాలు ఉన్నాయి అంటూ ఒక రూమర్ క్రియేట్ చేశారు. అంతేకాదు ఆ రాజకీయ నాయకుడు అంటే పడని ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేశారు. అయితే చాలా రోజుల నుండి దీన్ని అందరూ మర్చిపోయినప్పటికి రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాడ్ కాస్ట్ లో హైదరాబాద్ ఇల్లు గురించి మాట్లాడడంతో మరోసారి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: