`ఖడ్గం`.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన వండర్ ఫుల్ చిత్రాల్లో ఒకటి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్‌ ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటించారు. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ త‌దిత‌రులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఖడ్గం మూవీ 2022లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణవంశీ స్క్రీన్ ప్లే, దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, రియ‌ల్ లైఫ్ కు ద‌గ్గ‌ర‌గా ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.


సినిమాలో మ‌రొక హైలెట్ శ్రీ‌కాంత్‌, సోనాలి బింద్రే ల‌వ్ ట్రాక్‌. వీరి స్టోరీ చిన్న‌దే అయినా మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు కృష్ణ‌వంశీ. ముఖ్యంగా శ్రీ‌కాంత్‌, సోనాలి బింద్రే మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సాంగ్ నెక్స్ట్ లెవ‌ల్‌. అయితే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఖ‌డ్గంలో సోనాలి బింద్రే ఓన్ వాయిస్ ఇవ్వ‌లేదు. సోనాలి బింద్రేకు భాష రాక‌పోవ‌డంతో.. ఆమె పాత్ర‌కు ఓ తెలుగు స్టార్ హీరోయిన్ డ‌బ్బింగ్ చెప్పారు.


ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు ర‌మ్య‌కృష్ణ‌. డైరెక్ట‌ర్ కృష్ణవంశీ సతీమణి అయిన ర‌మ్య‌కృష్ణ‌.. ఖ‌డ్గంలో సోనాలి బింద్రేకు గాత్ర‌దానం చేశారు. కాగా, రెండున్నర కోట్ల బడ్జెట్ తో 72 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఖడ్గం మూవీ.. విడుదల తర్వాత భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే ఐదు నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది. హిందీలో `ఇన్సాన్` అనే టైటిల్ తో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ లాంటి స్టార్లు ఖ‌డ్గం మూవీని రీమేక్ చేయ‌డం మ‌రొక విశేషం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: