
ప్రస్తుతం మరోసారి విజయ్ తో జననాయగన్ సినిమాలో నటించడం ఉత్సాహంగా ఉందని ఆమె కామెంట్ చేశారు. విజయ్ అద్భుతమైన నటుడు అని అయితే ఈ సినిమా విజయ్ చివరి సినిమా కావడం బాధ కలిగిస్తుందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. నా దృష్టిలో ఇదొక చేదు వార్త అని పూజా హెగ్డే అభిప్రాయం వ్యక్తం చేశారు. నాతోపాటు ఎంతోమంది ఫ్యాన్స్ విజయ్ సినిమాలను ఇష్టపడతారని విజయ్ సినిమాల కోసం ఎదురుచూసిన రోజులు సైతం ఉన్నాయని పూజ హెగ్డే అన్నారు.
ఈ మధ్యకాలంలో నేను నటించిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని కొన్నేళ్లుగా నా కెరీర్లో విజయం అనే పదానికి నిర్వచనం మారిపోయిందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. కానీ ఈ దశ నాకు ముఖ్యమైందని ప్రస్తుతం నా రాబోయే సినిమాలు, భవిష్యత్తు సినిమాలు నేను ఎలాంటి నటిననే విషయాన్ని ప్రేక్షకులకు చూపిస్తాయని ఆశిస్తున్నానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
నిజం చెప్పాలంటే సినిమా నేపథ్యం నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని సినిమా ఇండస్ట్రీలో వాళ్లంతా అవకాశాలను దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాలని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. ఎన్నో సవాళ్లు, అనుభవాలతో సినీ రంగంలో ప్రస్తుతం నేను ఒక స్థాయిలో ఉన్నానని పూజా హెగ్డే పేర్కొన్నారు. కానీ నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ఆమె తెలిపారు.