
ఎస్ మరో నాలుగు నెలల్లో నెలలలో టాలీవుడ్ లో ఎవరు ఊహించని అదిరిపోయే బిగ్ సర్ప్రైజ్ న్యూస్ ఒకటి బయటకు రాబోతుంది. మీరు పైన చూసిన టైటిల్ నిజమే బన్నీ - ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. అదేంటి బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు .. ప్రభాస్ చాలా క్రేజీ లైన్లో దూసుకుపోతున్నాడు .. వీరిద్దరికీ అస్సలు ఖాళీ లేదు .. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఇది నిజమే బన్నీ కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 1972లో ప్రారంభమైంది. ఈ బ్యానర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అల్లు అరవింద్ చిన్న సినిమాల నిర్మాణానికి పరిమితం అయ్యారు.
తండేల్ సినిమాతో ఒక మాత్ర బడ్జెట్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన అరవింద్ ఈసారి ఏకంగా ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరో నాలుగు నెలల లో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమాలో బన్నీ కూడా నిర్మాణం భాగస్వామిగా ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకులు ఎవరు ? ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి విషయాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అండర్ కరెంట్ గా వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు