నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ప్రస్తుతం బాలయ్యకు మాహర్దశ నడుస్తోంది. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. మరోవైపు నేషనల్ అవార్డ్స్ తో బాలయ్య ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. ఇక బర్తడే సందర్భంగా బాలయ్యకు మాత్రమే సొంతమైన రికార్డ్స్ మరియు ఆయ‌న ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


- 1974లో విడుదలైన `తాతమ్మ కల` సినిమాతో బాలకృష్ణ నటన ప్రస్థానం ప్రారంభమైంది. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో బాలయ్య టచ్ చేయని జోనర్ లేదు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జోనర్లను టచ్ చేసిన ఏకైక హీరోగా బాలయ్య నిలిచారు.

- 1987లో బాలకృష్ణ నటించిన ఏడు చిత్రాలు విడుదల కాగా.. అన్ని సినిమాలు బాక్సాఫీస్ హిట్టుగా నిలవడం ఒక రికార్డు.

- ఒకటి కాదు రెండు కాదు దాదాపు 17 చిత్రాల్లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. అత్యధిక సినిమాల్లో డ్యూయ‌ల్ రోల్‌ చేసిన హీరోగా బాలయ్య రికార్డ్ సృష్టించారు. అలాగే `అధినాయకుడు` సినిమాలో త్రిపాత్రాభినయం చేసి చెలరేగిపోయారు.

- సొంత పేరుతో ఏడు చిత్రాల్లో నటించిన ఘనత బాలయ్య సొంతం. తండ్రి నందమూరి తారక రామారావు గారితో పదికి పైగా చిత్రాల్లో  బాలయ్య స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

- ఐదు దశాబ్దాల కెరీర్ లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య అత్యధిక చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్ లో ఏకంగా 13 సినిమాలు వచ్చాయి. వాటిలో మెజారిటీ చిత్రాలు ఘన విజయం సాధించాయి.

- కెరీర్ మొత్తంలో బాలయ్య చాలా హుషారుగా చేసిన చిత్రం `పైసా వసూల్`. ఇదే సినిమాలో ఆయన `మామా ఏక్ పెగ్‌లా` అంటూ సింగర్ గా కూడా మారడం మరొక విశేషం.

- బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన `లెజెండ్` మూవీ వెయ్యి రోజులకు పైగా థియేటర్స్ లో ప్రదర్శితమయింది. ఇదొక రేర్ రికార్డ్ గా చెప్తారు. అలాగే బాలయ్య నటించిన 71 చిత్రాలు 100 రోజులకు పైగా ఆడాయి.

- 43వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(గోవా) వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముఖ్య అతిథి హోదాలో వెళ్లిన‌ ఒకే ఒక్క నటుడు బాలయ్య.

- చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. స్కూల్ డేస్ లో బాలయ్య టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. ఇటీవల బాలయ్య `పద్మ భూషణ్` అందుకున్నారు. ఆపై `ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్‌` అవార్డు కూడా ఆయనను వరించింది. ప్రస్తుతం `అఖండ 2` మూవీతో బిజీగా ఉన్నారు. లైన్ లో `ఎన్‌బీకే 111` వన్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: