మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. చివరిగా `గుంటూరు కారం` మూవీతో ప్రేక్షకులను పలకరించారు. మిక్స్డ్‌ టాక్ వచ్చినప్పటికీ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కావడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. `గుంటూరు కారం` తర్వాత ఏడాది కష్టపడి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ తో ఓ అద్భుతమైన స్టోరీ రెడీ చేసుకున్నాడు. బన్నీకి కూడా స్టోరీ నచ్చింది. కానీ ఆయన త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అట్లీతో పట్టాలెక్కించారు. ఇది ఒక రకంగా త్రివిక్రమ్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.


ఇదే తరుణంలో త్రివిక్రమ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బ‌న్నీ కోసం రెడీ చేసుకున్న కథని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెర‌కెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్న‌ట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైథాలాజికల్ టచ్ అంటే ఎన్టీఆర్ కు బాగా సూట్ అవుతుంది. పైగా ఆయన కూడా నో చెప్పే ఛాన్స్ ఉండదని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.


అయితే ఎన్టీఆర్ లైన‌ప్ లో ప్రశాంత్ నీల్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి పూర్తి అయ్యాకే త్రివిక్రమ్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈలోపు త్రివిక్రమ్ టైమ్ వేస్ట్ చేయ‌కుండా వెంకటేష్, రామ్ చరణ్ వంటి హీరోల‌ను లైన్ లో పెట్టారు. ముందుగా వెంకటేష్‌తో ఓ మూవీ ఆపై రామ్ చరణ్ తో ఒక సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటనలు రానున్నాయ‌ని టాక్‌.

 

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: