నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభిస్తుంది. ఈ మూవీ టీజర్ అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది.

మూవీ టీజర్ ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఒక రెండు సినిమాల రికార్డులను క్రాస్ చేసింది. అసలు విషయం లోకి వెళితే ... అఖండ 2 మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 22.33 మిలియన్ వ్యూస్ ... 531.5 కే లైక్స్ లభించాయి. ఇలా అఖండ 2 మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి చిరంజీవి "విశ్వంభర" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో  20.95 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ఇంత కాలం పాటు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నటించిన సినిమా టీజర్లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టీజర్లలో విశ్వంభర మూవీ టీజర్ మొదటి స్థానంలో కొనసాగింది. కానీ ఇప్పుడు అఖండ 2 మూవీ టీజర్ మొదటి స్థానంలోకి వచ్చింది. చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 516.5 కే లైక్స్ లభించాయి. దానితో ఈ మూవీ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సీనియర్ స్టార్ హీరోలలో మొదటి స్థానంలో ఉండగా ... దానిని కూడా అఖండ 2 మూవీ క్రాస్ చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: