
ఇక నిర్మాతలకి డబ్బులు వస్తేనే హీరో అనాలి అంటే సినిమా పోతే అతి తక్కువ నష్టం, హిట్ అయితే అతి ఎక్కువ లాభం తెచ్చే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా బాలయ్యకే సొంతం. వెండితెర మీద మాత్రమే కాదు ఇటు బుల్లితెర ఓటీటీని షేక్ చేయడం కూడా బాలయ్యకే సొంతమైంది. హీరో అంటే కొత్త ప్రయోగాలు చేయాలి కొత్త దర్శకులని ఛాన్సులు ఇవ్వాలి అంటే ఇక ఏ హీరో బాలయ్య దరిదాపులకు రాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య ఎందరో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. అలాగే సినిమా వాళ్ళు కాదు హీరో అంటే ప్రజల్లో ఉండే వాళ్ళు ... రాజకీయ నాయకులు నిజమైన హీరోలు అనుకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత బాలయ్యకే సొంతం.
కులాల లెక్కల ప్రకారం సేఫ్ సైడ్ చూసుకుని నిలబడుతున్న కాలంలో సొంత కుల బలం కాదు ... దాదాపుగా 35% వేరే మతం వాళ్ళు ఉండే నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఘనత బాలయ్యకే సొంతం. పార్టీ వ్యతిరేక వేవ్‌లోనూ గత మెజార్టీని మించి ఎమ్మెల్యేగా గెలిచి... ఓడిపోయినప్పుడు కూడా నిలబడ్డాడు బాలయ్య. ఇటు సినిమాల్లోనూ.. అటు రాజకీయంగాను ఒక్క అవినీతి ఆరోపణ రాలేదంటే నిజాయితీగా నిలబడే ఘనత బాలయ్యదే. సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు హీరోలు కాదు, ప్రజలకి ఏమైనా చేసే వాళ్ళే హీరోలు అంటే 20 ఏళ్లుగా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టీ పేదలకి సేవ చేస్తున్న రియల్ హీరో కూడా బాలయ్యే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు