
కోలీవుడ్ లో హిట్ గా నిలచిన నట్టమై సినిమాను తెలుగులో తీస్తే విజయం సాధిస్తుందని.. వెంటనే ఆ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయమని మోహన్ బాబుతో రజినీకాంత్ చెప్పారు. స్నేహితుడు చెప్పడంతో మోహన్ బాబు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అప్పటికే సీనియర్ నిర్మాత కేవీవీ సత్యనారాయణ నట్టమై మూవీని తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. రీమేక్ హక్కుల కోసం నట్టమై నిర్మాత ఆర్.బి చౌదరితో సంప్రదింపుడు జరిపారు. మంచి రేటు కుదరడంతో ఆయన రీమేక్ రైట్స్ విక్రయించడానికి ముందుకు వచ్చారు. కేవీవీ సత్యనారాయణ కొత్త డబ్బు కూడా ఆయనకు ఇచ్చారు.
సరిగ్గా ఒప్పంద పత్రాలపై సైన్ చేయడానికి ముందు రజనీకాంత్ నుంచి ఆర్.బి చౌదరికి ఫోన్ వచ్చింది. నట్టిమై రీమేక్ రైట్స్ మోహన్ బాబుకు ఇవ్వాలని ఆయన అడిగారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ స్వయంగా ఫోన్ చేసి అడగడంతో ఆర్.బి చౌదరి కాదనలేకపోయారు. కేవీవీ సత్యనారాయణకు విషయం చెప్పి మోహన్ బాబుకు నట్టమై రీమేక్ హక్కులను అమ్మేశారు. అలా టాలీవుడ్ తండ్రీకొడుకులైన ఎన్టీఆర్ బాలకృష్ణ చేయాల్సిన సినిమా మోహన్ బాబు చేతికి వెళ్ళింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేతుల మీదగానే ఈ సినిమా ప్రారంభం అయింది.
కథలో పాపారాయుడుగా రజనీకాంత్, పెదరాయుడుగా మోహన్ బాబు నటించిగా.. పెదరాయుడు తమ్ముళ్ల పాత్రలను మోహన్ బాబు, రాజా రవీంద్ర చేశారు. సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని తెలుపుతూ కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన పెదరాయుడు మూవీ 1995 జూన్ 15న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇంకా చెప్పాలంటే తమిళంలో కన్నా తెలుగులోనే ఈ సినిమా పెద్ద హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక పెదరాయుడు మూవీ లో పాపారాయుడు పాత్ర చేసినందుకు రజనీకాంత్ స్వయంగా ముందుకు వచ్చారు. కానీ ఆ పాత్ర నడివి తక్కువగా ఉండటం వల్ల మోహన్ బాబు అందుకు ఒప్పుకోలేదు. అయితే నిడివి తక్కువగా ఉన్న కథలో అత్యంత ముఖ్యమైన పాత్ర కావడంతో రజనీకాంతే పెదరాయుడుగా నటించారు. అందుకు ఆయన పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీ ఎపిసోడ్ కు థియేటర్లు దద్దరిల్లాయి. పెదరాయుడు పాత్రలో రజనీ అద్భుతంగా ఒదిగిపోయారు. అదేవిధంగా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పెదరాయుడును నిర్మించిన మోహన్ బాబు భారీ లాభాలను అందుకున్నారు.