
ఇప్పుడు బాలయ్య కు సంబంధించిన ఒక ఫన్నీ మూమెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇద్దరు అల్లుళ్ల తో ముద్దుల మామయ్య అనే క్యాప్షన్ పెట్టి నందమూరి అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు . ఇటీవల హైదరాబాదులో మాజీ ఎంపీ బంధువు కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకకు బాలకృష్ణ తన అల్లుడితో కలిసి అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో బాలయ్య తన పెద్ద అల్లుడు నారా లోకేష్ అలాగే చిన్న అల్లుడు శ్రీ భరత్ తో చేసిన అల్లరి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఇది చాలా సరదాగా ఫన్నీ గా ఉండటంతో ఈ వీడియో ని ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు. బలయ్య లో ఈ యాంగిల్ కూడా ఉందా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి అల్లుళ్లపై సరదాగా చేతులేసి నవ్వులు కురిపించాడు బాలయ్య . అంతేకాదు లోకేష్ తన హైట్ కు సరిపోతున్నాడు అని .. భరత్ కొంచెం హైట్ ఎక్కువైపోవడం కారణంగా చేయి వేయలేకపోతున్నానని సరదాగా ఆటపట్టించాడు. ఒకవేళ నీ మీద చెయ్యి వేస్తే పుష్ప రాజ్ ల అయిపోతానేమో అంటూ నవ్వుతూ సెటైర్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్యలో ఇంత నాటి యాంగిల్ కూడా ఉందా..? ఇంత చిలిపి వ్యక్తా..? అంటూ సరదాగా నందమూరి అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు..!