
బాహుబలి తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత ఊపందుకుంది. టాప్ హీరో నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అందరూ సీక్వెల్స్ వెనుక పరుగులు పెడుతున్నారు. టాలీవుడ్ లో చూసుకుంటే రీసెంట్ టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 1`, `పుష్ప 2` చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు.
అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ లో `సలార్`, `కల్కి 2898 ఏడీ` సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల `దేవర` సినిమాతో బిగ్ హిట్ అందుకున్నాడు. అయితే డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వల్ గా `దేవర 2`ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో సీక్వెల్ చిత్రాలకు దూరంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా.. మరొకరు రాంచరణ్. ఈ ఇద్దరు హీరోలు ఇంతవరకు సీక్వెల్స్ జోలికి పోలేదు. మరి ఇకముందు వెళ్తారా అన్నది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు