
ఇటీవల ఓ టి టి సంస్థలు బాగా ముదిరిపోయాయి. సినిమాలు కొనటం లేదు. విడుదలకు ముందు ఓటిటి డీల్స్ క్లోజ్ చేయడం చాలా కష్టంగా మారింది. మరీ టాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాతలు .. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలు అయితే మినహా మిడిల్ రేంజ్ నిర్మాతలు మిడిల్ రేంజ్ సినిమాల ఓటీటీ హక్కులు కొనటం లేదు. ఇలాంటి కష్ట పరిస్థితులలో దిల్ రాజు నిర్మాతగా ... నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కి మంచి బేరం కుదిరింది. తమ్ముడు ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా దిల్ రాజు బ్యానర్లో వచ్చే సినిమాల హక్కులు అన్నింటిని అమెజాన్ కి అమ్ముతారు. అయితే తొలిసారి నెట్ ఫ్లిక్స్ గడప తొక్కింది దిల్ రాజు సంస్థ. సినిమా చూపించి మరి ఓటిటిడి క్లోజ్ చేసినట్టు సమాచారం. శాటిలైట్ రైట్స్ మా సొంతం చేసుకుంది.
నాన్ థియేటర్ రైట్స్ రూపంలో రు. 38 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాపై 75 కోట్లు ఖర్చుపెట్టారు. మిగిలిన 37 కోట్లు థియేటర్ల నుంచి రావాలి. ఇటీవల నితిన్ కు వరుస ప్లాపులు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్ బాగా నిరాశపరిచింది. శ్రీలీల హీరోయిన్గా ఉన్న ఉపయోగం లేదు. తమ్ముడు సినిమా కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇలాంటి టైం లో నాన్ ధియేటర్ హక్కులు రు. 38 కోట్లకు అమ్మరు అంటే మంచి వ్యాపారమే అనుకోవాలి. దర్శకుడు వేణు శ్రీరామ్ ట్రాక్ రికార్డు బాగుండటం ... దిల్ రాజు నిర్మాత కావడంతో ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఓకే అనిపించుకుంది. పైగా ఈ నెల 28న రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు