తెలుగు బుల్లితెర అభిమానుల్లో చాలా మంది బిగ్ బాస్ లవర్స్ ఉన్నారు. బిగ్బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ గానే ఉంటుంది. దానితో ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది బుల్లితెర బిగ్బాస్ సీజన్లు కంప్లీట్ కాక , ఒక ఓటిటి సీజన్ కంప్లీట్ అయింది. ఓటిటి బిగ్బాస్ సీజన్ కంప్లీట్ అయ్యి చాలా కాలమే అవుతున్న దీనికి సంబంధించిన రెండవ సీజన్ మాత్రం రావడం లేదు. తెలుగు బుల్లితెర బిగ్బాస్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో వరుస పెట్టి ఈ సీజన్లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

దానితో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు తెలుగులో కంప్లీట్ కాక ఆ ఎనిమిది సీజన్లు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని రోజుల్లోనే తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తొమ్మిదవ సీజన్ కు నాగార్జున కాకుండా వేరే హీరో హోస్ట్ గా వ్యవహరిస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ నాగర్జున 9 వ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. తొమ్మిదవ సీజన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడడంతో ఈ సీజన్లో ఎవరు హౌస్ లోకి ఎంటర్ ఇస్తారు ..? అనేది బిగ్ బాస్ లవర్స్ కి ఎంతో ఆసక్తిగా మారింది. దానితో వారు బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనన్నారు ..? విరు ఎంట్రీ ఇవ్వనున్నారు అని అనేక వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని కుర్రకారు గుండెల్లో అనేక సార్లు తన అందాలతో సెగలు పుట్టించిన ఓ బ్యూటీ బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మధ్య కాలంలో చిట్టి పికిల్స్ కి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిట్టి పికిల్స్ ను ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నడిపారు. కొన్ని రోజుల క్రితం మీ పికిల్స్ ధరలు ఎక్కువ ఉన్నాయి అని కొంత మంది అనడంతో వారిని వీరు తిట్టడంతో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ముగ్గురు అక్క చెల్లెలలో ఒకరు అయినటువంటి రమ్య మోక్ష "బిగ్బాస్ 9" లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంతక్వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm