- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా మంది హీరోలు అభిమానులుగా ఉన్నారు. ఆయన పేరు చెబితే ఊగిపోయే హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో చెప్పుకోవలసిన హీరో నితిన్. కెరీర్‌ ప్రారంభం నుంచి తనను తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకుంటూ వస్తున్నాడు నితిన్. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ సినిమాలకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నితిన్ తన సినిమాలలో పవన్ కు ఇచ్చే ఎలివేషన్ .. వాడే రిఫరెన్సుల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నితిన్ ఛ‌ల్ మోహన్ రంగా సినిమాను సైతం పవన్ నిర్మించాడు. ఒక దశలో నితిన్ ప్రతి సినిమాలోని పవన్ రిఫ‌రెన్సులు ఎక్కువగా కనిపించడంతో తమ అభిమాని హీరోను నితిన్ బాగా వాడేస్తున్నాడని కొందరు సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో నితిన్ కాస్త నొచ్చుకున్నట్టే ఉన్నాడు.


అందుకే తన కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తమ్ముడు పెట్టడానికి ముందుగా తడి ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అతడు వెల్లడించాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ - నిర్మాత దిల్ రాజు ముందుగా తనకు కథ చెప్పినప్పుడు తమ్ముడు అని టైటిల్ చెప్పారని .. అయితే తాను ఆ టైటిల్ వద్దని చెప్పానన్నాడు. ఇప్పటికే తాను పవన్ కళ్యాణ్ బాగా వాడేస్తున్నానని కొందరు అంటున్నారని .. అందుకే ఈ టైటిల్ వద్దని తాను చెప్పినట్టు నితిన్ తెలిపారు. పవన్ సినిమా టైటిల్ పెట్టాలన్న ఉద్దేశం తమ‌కు లేదని ... ఈ కథకు ఆ టైటిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని నచ్చజెప్పడంతో తాను ఓకే చెప్పినట్టు నితిన్ తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: