మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. హిందీలో మహాభారతం వంటి ఎపిక్ సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప మూవీని మోహ‌న్ బాబు స్వ‌యంగా నిర్మించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి స్టార్స్ భాగం అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభించింది.


ముఖ్యంగా ప్రభాస్ పోషించిన రుద్ర క్యారెక్టర్ సినిమా మొత్తానికి మెయిన్ హైలెట్ గా నిలిచింది. ప్రభాస్ కోసమే థియేటర్స్ కు క్యూ క‌డుతున్న‌ జనాలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఫలితంగా కన్నప్ప బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. రెండో రోజు కూడా ఎక్సలెంట్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన కన్నప్ప.. రెండో రోజుకు మరింత పుంజుకుని రూ. 22.5 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను క‌లెక్ట్ చేసింది.


రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా క‌న్న‌ప్ప‌కు రూ. 42.5 కోట్ల రేంజ్ లో గ్లాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడో రోజు సండే కావడంతో ఈ మూవీ రూ. 50 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, 2 డేస్ థ్రియేట్రిక‌ల్ ర‌న్ ముగిసే స‌మ‌యానికి క‌న్న‌ప్ప మంచు విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: