బొమ్మరిల్లు’ ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ మూవీలు వరస బ్లాక్ బష్టర్ గా మారడంతో అప్పట్లో సిద్ధార్థ్ ఆనాటి తరం అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. అయితే ఆతరువాత అతడు నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లు అవ్వడంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు చూడటం రాదు అంటూ అప్పట్లో ఒక అనాలోచిత కామెంట్ చేసి సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యాడు.


ఆతరువాత అతడు వరసపెట్టి తమిళంలో సినిమాలు చేస్తూ వాటిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. లేటెస్ట్ గా ఇతడు నటించిన ‘3 బిహెచ్ కె’ జూలై 4న విడుదల కాబోతోంది. ఈమూవీని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తు తెలుగు రాష్ట్రాలలో కూడ బాగా ప్రమోట్ చేస్తున్నారు.


ఈసందర్భంగా జరిగిన ఒక మీడియా సమావేశంలో పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సిద్దార్థ్ సమాధానం చెబుతూ ఎవరికో మనీ రావడానికి తాను సినిమాలు చేయడం లేదని మీకలా అనిపిస్తే నేనేం చేయలేనని అంటూ మరొక వివాదానికి శ్రీకారం చూట్టాడు. అంతేకాదు ఒక మీడియా ప్రతినిధి తన సినిమాను చిన్న సినిమా అన్నందుకు కూడా సిద్దార్థ్ కు కోపం వచ్చింది. సినిమాలకు చిన్నా పెద్ద భేదం ఉండదని అంటూ సినిమా కథ గురించి ఆలోచించాలి కానీ కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తే అవి మంచి సినిమాలు అయిపోతాయా అంటూ మరొక కొత్త కామెంట్స్ చేశాడు.


దీనితో సోషల్ మీడియాలో ఈహీరో కామెంట్స్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరు సిద్దార్థ్ ను విమర్శిస్తూ కామెంట్స్ పెడితే  మరికొందరు సిద్దార్థ్ కు బాసటగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా  ఈవారం నితిన్ నటించిన ‘తమ్ముడు’ మూవీతో పోటీ పడుతున్న పరిస్థితులలో ఎంతవరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి. వరస ఫ్లాప్ ల మధ్య సతమతవుతున్న నితిన్ సీదార్థలకు ప్రస్తుతం ఒక హిట్ కావాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: