టాలీవుడ్ లో ప్రస్తుతరంలో కామెడీ హీరో అంటే అల్లరి నరేష్ గుర్తుకు వస్తారు .  కానీ ఇది ఒకప్పటి మాట .. ఇప్పుడు ఆయన అన్ని వెరైటీ పాత్రలే ఎంచుకొని మరి సినిమాలు చేస్తున్నారు .. నాంది, ఉగ్రం, బచ్చలపల్లి .. ఇలా ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ .. ఇక ఇప్పుడు తాజా గా సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేబోతున్నారు .. ఇది ఆయన 63వ సినిమా .. ఈ సినిమా లో ఆయన పాత్ర కూడా ఎంతో డిఫరెంట్ గానే ఉంటుంద .. అయితే ఇది మరీ కామెడీ కు దూరం కాదట .. చిన్న అల్లరి టచ్ ఉంటునే వెరైటీ గా ఉండబోతుందని తెలుస్తుంది ..


అలాగే ఈ సినిమా కు ఆల్కహాల్ అనే టైటిల్ ను ఒకే చేస్తు ఈ సందర్భంగా విడుదల చేసిన సోషల్ మీడియాలో  విడుద‌ల చేసిన‌ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది .. ఆల్కహాల్ అనే టైటిల్ ని ఎంతో కొత్తగా ఉంది .. అల్లరి నరేష్ క్యారెక్టర్ కూడా కాస్త కొత్తగా వింతగా ఈ సినిమాలో ఉంటున్నట్టు తెలుస్తుంది .. ఆల్కహాల్ తాగిన అల్లరి చేస్తారు .. కానీ ఆల్కహాల్ తాగిన వాళ్లను అల్లరి పెట్టే క్యారెక్టర్ అంటే కాస్త డిఫరెంట్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది .. . అలాగే ఈ సినిమాకు ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్  రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి .. సితార సంస్థతో కాకుండా చిట్టూరి శ్రీను నిర్మాతగా ఓ సినిమా , మరో సినిమా నిర్మాణంలో ప్రస్తుతం ఉంది .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: