
ఇలాంటి క్యారెక్టర్ని చాలామంది చేయాలి అనుకుంటారు కానీ అలాంటి ఛాన్స్ అందరికీ రాదు . వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి . ఈ క్రమంలోనే కుబేర సినిమా చూసిన తర్వాత నాగార్జున క్యారెక్టర్ బాగా ఇంప్రెస్ చేసిందట చిరంజీవిని . అందుకే అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తాను అంటూ డైరెక్టర్స్ కి మేకర్స్ కి చెప్పుకొచ్చారట . ఫైనల్లీ అలాంటి ఒక క్యారెక్టర్ చిరంజీవికి దొరికేసింది . అది కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోనే అంటూ న్యూస్ బయటకు వచ్చింది . సందీప్ రెడ్డివంగ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .
ఆయన సినిమాలో హీరోకి ఎంత ప్రియారిటి ఇస్తారో అదే విధంగా విలన్ కి కూడా అంతే హై లెవెల్ సీన్స్ రాసుకుంటారు . మరి ముఖ్యంగా విలన్ ని విలన్ గా కాకుండా విలన్ హీరోగా చూపించే సత్తా ఉన్న డైరెక్టర్. ఆ విషయం అనిమల్ సినిమాలో మనం బాగా గమనించొచ్చు. కాగా చిరంజీవి ఆయన ఫేవరెట్ హీరో ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాడు. కాగా ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం చిరంజీవి ఫైనలైజ్ అయినట్లు తెలుస్తుంది. ఇది నెగటివ్ షేడ్శ్ ఉన్న పాత్ర . స్పిరిట్ సినిమా లో ఈ పాత్ర చాలా చాలా కీలకమట. ఆ కారణంగానే ఈ క్యారెక్టర్ ను చిరంజీవికి వివరించగా ఆయన ఓకే చేశారట . సేమ్ కుబేర సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుందో..? ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ అలానే ఉంటుందట . ఇది నిజంగా మెగా ఫాన్స్ కి ఊహించని షాక్. చిరంజీవి లాంటి వాడు హీరో గానే ఉండాలి అనుకుంటారు..నెగటివ్ షేడ్శ్ లో చూడాలి అని అనుకోరు . కానీ చిరంజీవి ఓకే చేశాడు అంటే కచ్చితంగా అందులో ఎంతో కొంత లాజిక్ ఉంటుంది . చూడాలి మరి ఆ లాజిక్ ఏంటో..?? సినిమా రిలీజ్ అయ్యాకే అర్థం అవుతుంది..!