
అదే విధంగా రాజమౌళి సైతం ఈ సినిమాని వేరే లెవెల్ లో చూపించడానికి తన ఫుల్ టాలెంట్ ని ఉపయోగిస్తున్నారు . ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కోసం నమ్రత ని చూపించాలి అనుకుంటున్నారట రాజమౌళి. అయితే మహేష్ బాబు మాత్రం వెంటనే అలాంటివి కుదరవు ఆమెకి ఇష్టం లేదు అంటూ తేల్చి చెప్పేసాడు అని వార్తలు వినిపించాయి. నమ్రత కూడా ఏ ఇంటర్వ్యూలో అయిన సరే తను ఇక సినిమాల్లోకి రాను అంటూనే చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడు రాజమౌళి కల్ళు సితార పై పడ్డట్లు తెలుస్తుంది.
ఇప్పుడు సీతారని ఈ సినిమాలో మరొక స్పెషల్ క్యారెక్టర్ కోసం రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట . నమ్రత విషయంలో హ్యాండ్ ఇచ్చిన రాజమౌళి సితార విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకునేదే లేదు అంటూ చెప్పేశార్ట జక్కన్న. ఈ సినిమా ద్వారానే సితార నిఇంట్రడ్యూస్ చేయాలి ..ఈ సినిమా తోనే సితార డెబ్యూ ఇవ్వాలి అంటూ రాజమౌళి పట్టుబడుతున్నారట. కానీ అప్పుడే సీతారని ఇండస్ట్రీలోకి దింపడం మహేష్ బాబుకి ఇష్టం లేదు. చదువు కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి ప్రాజెక్టు చూసి రంగంలోకి దించాలనుకుంటున్నారు .
కానీ రాజమౌళి ఏమో ఈ క్యారెక్టర్ కోసం సీతారనే పర్ఫెక్ట్ అంటున్నారు . పైగా తండ్రి కాంబోలో వచ్చే సినిమాతో డెబ్యూ అంటే సితార కి కూడా ఒక స్పెషల్ గౌరవం దక్కుతుంది . ఇప్పుడు మింగలేక కక్కలేక పొజిషన్లో ఉన్నాడు మహేష్ బాబు అంటూ ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా మహేష్ బాబుతో సినిమాను ఓకే చేసి సీతారను మధ్యలోకి లాక్కొస్తున్నాడే.. సితార సర్వీస్ అంతా ఫ్రీ నేనా అంటూ కూసింత ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు . కొంతమంది మాత్రం దించేయ్.. మహేష్ బాబు దించేయ్ సితారని కూడా ఈ ప్రాజెక్టులోకి లాగేయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!