చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వంభర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేకపోయినా మేకర్స్ ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. విశ్వంభర సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాపై రిస్క్  ఒకింత భారీ స్థాయిలోనే ఉందని  అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. అయితే  ఈ సినిమా ఫుటేజ్ ను చూసిన  ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రం సినిమా  వేరే లెవెల్ లో ఉందని కామెంట్ చేశారట.  ఈ సినిమా కొరకు సృష్టించిన లోకాలు  వేరే లెవెల్ లో  ఉన్నాయని తెలుస్తోంది. టీజర్ గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వ్యక్తమైనా   సినిమాలో మాత్రం   సినిమాలో గ్రాఫిక్స్ వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.

విశ్వంభర సినిమా  ఎప్పుడు విడుదలైనా  రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు  చిరంజీవి కెరీర్ లో సైతం  ఈ  సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని  కామెంట్లు వినిపిస్తున్నాయి.  విశ్వంభర సినిమా ప్రేక్షకుల ఊహలకు, అంచనాలకు భిన్నంగా ఉండనుందని ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి   తెరపై కనిపిస్తుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మల్లిడి వశిష్ట కెరీర్ కు సైతం ఈ సినిమా కీలకమని చెప్పవచ్చు.

ఈ సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను  సైతం  దర్శకుడు   బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.   విశ్వంభర సినిమా  పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను  మెప్పిస్తుందేమో  చూడాల్సి ఉంది.  విశంభర సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు  సృష్టిస్తుందో  చూడాల్సి ఉంది.  విశ్వంభర సినిమా  ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే చిరంజీవి తర్వాత సినిమాల రేంజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: