తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వర్షా బొల్లమ్మ ఒకరు. ఈమె మిడిల్ క్లాస్ మెలోడీస్ , ఊరు పేరు భైరవకోన , స్టాండప్ రాహుల్ , స్వాతిముత్యం తదితర తెలుగు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది.

అయినా కూడా ఈ సినిమాలోని వర్ష బొల్లమ్మ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన వివరాలను ఆమె తెలియజేసింది.  నేను కొన్ని సంవత్సరాల క్రితం సమ్మర్ హాలి డేస్ లో మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ నేను దాదాపు 60 రోజులు ఉన్నాను. ఇక 60 రోజులలో 50 సార్లు నేను విక్రమార్కుడు మూవీ ని చూశాను.

నేను ఈ విషయంలో అస్సలు జోక్ చేయడం లేదు. నేను సమ్మర్ హాలిడేస్ లో మాక్సిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న సమయంలో మా కజిన్ సిస్టర్ ప్రతి రోజు విక్రమార్కుడు సినిమా చూసేది. అప్పట్లో డీవీడీలు ఉండేవి. దానితో విక్రమార్కుడు సినిమా  క్యాసెట్ వేసుకొని దాదాపు నేను ఉన్న రోజులు అంటే 50 రోజుల పాటు ఒకే సినిమాను చూసింది. ఆ సిబిమాలో ఉండే సాంగ్స్ అంటే మా కజిన్ సిస్టర్ కి చాలా ఇష్టం. అలా 60 రోజుల్లో 50 సార్లు విక్రమార్కుడు సినిమా చూశాం అని వర్ష బుల్లమ్మ తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: