తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని  సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.. ఈయన ఇప్పటికీ ఆరుపదుల వయసు దాటినా కూడా  సినిమాల్లో, కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ అద్భుతమైన హిట్లు అందుకుంటున్నారు.. అయితే అలాంటి వెంకటేష్ తాజాగా అమెరికాలో వైభవంగా జరిగిన నాట్స్ 2025 ప్రోగ్రాం కు వెళ్లి తన సినిమాల గురించి మాట్లాడారు.. ఇదే సందర్భంలో ఆయన ఒక స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నానని అది అభిమానులకి ఎంతగానో నచ్చుతుందని చెప్పారు.. మరి ఆ స్టార్ హీరో ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. విక్టరీ వెంకటేష్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్టు చేస్తున్నారట..

 అంతేకాకుండా దృశ్యం 3 లో కూడా చేస్తున్నారట.. ఈ విషయాన్ని ఈ ప్రోగ్రాం లో ఆయన బయటపెట్టారు. అంతేకాదు  ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా హిట్ కొట్టిన ఆయన వీరి కాంబినేషన్లో మరో సినిమా కూడా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే నాట్స్ 2025 ప్రోగ్రాం లో నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాను.. ఆ హీరో నాకు మంచి స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చాడు..

ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రలో నటిస్తున్నారట. వీరిద్దరి మధ్య సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది.. ఈ విషయాన్ని వెంకటేష్ బయటపెట్టడంతో మెగా దగ్గుబాటి అభిమానులంతా ఆనంద పడిపోతున్నారు.. అంతేకాదు వెంకటేష్ చిరంజీవి కాంబోలో వచ్చే సంక్రాంతికి వస్తున్నాం డైరెక్షన్ లో మరో సినిమా కూడా రాబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి శివశంకర వరప్రసాద్ అనే తన ఒరిజినల్ పేరుతో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: