తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చిరు కెరియర్ లో 157 మూవీ గా తెరకేక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... చిరంజీవితో తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేష్ కూడా నటించబోతున్నాడు. ఆయన సినిమాలో జాయిన్ అయిన రోజు పెద్ద బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తాం అని చెప్పుకొచ్చాడు. దానితో వెంకటేష్ "మెగా 157" లో నటించబోతున్నాడు అనే దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇకపోతే వెంకటేష్ కూడా తాజాగా చిరు మూవీ లో నటించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగా 157 మూవీలో చిరు వెంకటేష్ పాత్రాల గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... మెగా 157 మూవీ లో చిరంజీవి , వెంకటేష్ ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్స్ పాత్రలో కనిపించబోతున్నట్లు , వీరిద్దరూ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను ఈ మూవీ లో చేదించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో వెంకటేష్ పాత్ర నిడివి చిన్నది కాదు అని , దాదాపు గంట సేపు వెంకటేష్మూవీ లో కనిపిస్తాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: