ఈ మధ్యకాలంలో అన్ని భాషలలో కూడా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే ఇలాంటివి తీసేటప్పుడు చాలా పరిమితులు ఉంటాయి.మితిమీరిన స్వేచ్ఛ తీసుకోలేము అంతేకాకుండా అనవసరమైన వాటికి వెళ్ళకూడదు. కేవలం జరిగిన సంఘటనలను సజావుగా చూపించే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అలా హీరో టావినో థామస్  నటించిన చిత్రం నరివెట్ట. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ సోనీ లీవ్ లో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సినిమా అడవులలో ఉండే గిరిజనులు తమ సొంత ఇళ్ల కోసం పోరాడుతున్న సంఘటనల ఆధారంగా తీశారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనురాజ్ మనోహర్ తెరకెక్కించారు.


కథ విషయానికి వస్తే..
వయనాడ్ అడవులలో సొంత ఇల్లు కోసం గిరిజనుల సైతం పోరాడుతూ ఉండగా.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వర్గీస్ పీటర్ (టావినో థామస్) తనకు ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్ ఉద్యోగంలోకి చేరుతారు. ఆ తర్వాత తమ బెటాలియన్ తో కలిసి బందోబస్తు కోసం వయనాడ్ కు వెళ్లాల్సి ఉంటుంది.. అక్కడ వెళ్లిన తర్వాత ఊహించని సంఘటనలు పరిణామాలు ఎదురవుతాయి. తన కళ్ళ ముందే జరిగిన సంఘటనలు చూసి చలించిపోయి ఏం చేశారు?. తమ బెటాలియన్లు జరిగిన సంఘటన ఏంటి? గిరిజనులకు వర్గీస్ పీటర్ ఏం చేస్తారు? అన్నదే ఈ సినిమా కథ.


నరివెట్ట చిత్రంలో అన్యాయమైన సంఘటన గురించి సమాజానికి తెలియజేసేలా చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా కూడా చాలా ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రానికి బలం వర్గీస్ క్యారెక్టర్. ఈ చిత్రాన్ని జై భీమ్ తరహాలో సస్పెన్స్ థ్రిల్లర్గా చూపించాలని ప్రయత్నం జరిగిన.. అంత ఎఫెక్టివ్ గా కుదర లేకపోయింది. కొన్నిసార్లు వర్గీస్ క్యారెక్టర్ బలహీన పడుతుంది.

వర్గీస్ వయనాడుకు వెళ్ళిన తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. సినిమా చివరి 40 నిమిషాలు హైలెట్ గా ఉన్నది. బ్రుటల్ పోలీస్ వ్యవస్థ చుట్టూ నడిపే సన్నివేశాలు గిరిజనుల పట్ల జరిగిన అమానుష సంఘటనలు అన్నీ కూడా ఆలోచింపచేసేలా ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఈ సినిమాలోని లొకేషన్స్ కూడా రియల్ గానే కొన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా చూడాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: