
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో జెనీలియా ఒకరు. జూనియర్ సినిమాతో జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీలొకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉందని నాకు సీనియర్ అనే స్థాయి కూడా వచ్చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో సినిమాల కోసం ఆడిషన్స్ అవసరమా అని సన్నిహితులు అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు.
అయితే అవసరమే అని తాను చెబుతానని ఎవ్వరైనా నన్ను ఒక ఆడిషన్ చూసి ఎంపిక చేస్తే, తప్పకుండా సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఒక గొప్ప పాత్రను దక్కించుకోవడం కోసం ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని నా ఫీలింగ్ అని అందువల్ల నేను ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు.
తెలుగులో 'బొమరిల్లు', హ్యాపీ, సాంబ, రెడీ, ఆరెంజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన జెనీలియా, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జూనియర్ సినిమా సక్సెస్ సాధిస్తే జెనీలియా రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. గ్లామర్ కన్నా పాత్రను నమ్మే నటులు మళ్లీ తెరపైకి రావడం పరిశ్రమకు మంచిదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రేక్షకులు కూడా ఆమెను మళ్లీ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నారు. జెనీలియాకి నచ్చిన పాత్ర వస్తే, ఆమె మళ్లీ మెరిసే అవకాశముంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల కొరత ఊహించని స్థాయిలో ఉన్న నేపథ్యంలో జెనీలియా రీ ఎంట్రీ ఇస్తే మాత్రం సంచలనం అవుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు