
నిజానికి ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1కి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ షరవేగంగా జరుపుకుంటుంది. ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, సముద్రఖని, శాలినీ పాండే తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు అదలా ఉంటే.. ధనుష్ ఇడ్లీ కొట్టు తెలుగు రైట్స్ కోసం ఇక్కడ పలు సంస్థలు పోటా పోటీ పడుతున్నాయి.
రీసెంట్ గా ధనుష్ నటించిన తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ `కుబేర` బిగ్ హిట్ గా నిలిచింది. అందుకు ముందు చేసిన `సార్` కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి చిత్రాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాను మేం కొంటామంటే మేము కొంటామని తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. అయితే `సార్` సినిమాను ప్రొడ్యూస్ చేసిన సితార సంస్థ ఇప్పటికే ధనుష్ తో టచ్ లోకి వెళ్ళింది. మరోపక్క కుబేర మూవీ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ సైతం ఇడ్లీ కొట్టు తెలుగు థియేట్రికల్ హక్కులు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ధనుష్ ఇడ్లీ కొట్టు ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు