పవన్ కళ్యాణ్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాల్లో ‘తమ్ముడు’ ఒకటి. 1999 జూలై 15న విడుదలైన ఈ సినిమా ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందింది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. తొలిప్రేమతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న పవన్, ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన అవతారంలో న‌టించిడు. సుబ్బు అనే గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగిన ఈ కథలో పవన్ కామెడీ టైమింగ్, యాక్షన్, భావోద్వేగాలను సమపాళ్లలో పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.


తమ్ముడు సినిమాలో పవన్ చూపించిన నటనతో హీరో అనే పాత్రకు కొత్త నిర్వచనమే ఇచ్చాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల మనసులు తాకాయి. ప్రారంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినా, రెండో వారం నుంచి భారీగా పికప్ అయ్యింది. మొత్తంగా రూ.5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం, చివరికి రూ.9.46 కోట్ల వరల్డ్‌వైడ్ షేర్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

టోటల్ కలెక్షన్లు:

నైజాం        – ₹3.20 కోట్లు  
సీడెడ్        – ₹1.85 కోట్లు  
ఉత్తరాంధ్ర     – ₹1.18 కోట్లు  
ఈస్ట్          – ₹0.77 కోట్లు  
వెస్ట్         – ₹0.54 కోట్లు  
గుంటూరు     – ₹0.78 కోట్లు  
కృష్ణా        – ₹0.55 కోట్లు  
నెల్లూరు      – ₹0.38 కోట్లు  

**ఏపీ+తెలంగాణ – ₹9.25 కోట్లు**  

**రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ – ₹0.21 కోట్లు**  

 **వరల్డ్‌వైడ్ టోటల్ షేర్ – ₹9.46 కోట్లు**

బయ్యర్లకు ఈ చిత్రం రూ. 4.26 కోట్ల లాభాలు అందించి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నైజాంలో చూడాలని ఉంది కలెక్షన్లను దాటి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. తమ్ముడు సినిమా పవన్ అభిమానులకు గుండెను తాకే సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్‌లో స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన పాతికేళ్ల పాత గోల్డ్ క్లాసిక్గా నిలిచింది. 26 ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమాకి క్రేజ్ తగ్గలేదు అంటే, అది పవన్ మేజిక్‌కి నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: