ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయో చెప్పడం కష్టంగా మారింది.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా ప్రేమించి వివాహం చేసుకుంటున్న పెళ్లిళ్లు ఎక్కువగా విడిపోతూ ఉన్నాయి. ఎంత ఈజీగా విడిపోతున్నారో అంతే త్వరగా మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సెలబ్రిటీలు. ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమని హింట్ ఇస్తున్నారు వారి గురించి చూద్దాం.



బద్రి సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రేణు దేశాయ్. ఈ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోకముందే అఖిరాకి జన్మనిచ్చింది. ఆ తర్వాత వివాహం చేసుకొని ఆధ్య అనే మరో బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. అయితే రెండో వివాహం చేసుకోబోతున్నట్లు అప్పట్లో రేణు దేశాయ్ ప్రకటించిన చాలా మంది ట్రోల్ చేశారు. చాలామంది కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు బెదిరించారనే వార్తలు వినిపించాయి..అయితే పిల్లలు పెద్దవారు అయిన తర్వాతే రెండో పెళ్లి చేసుకుంటానంటు తెలియజేసింది. ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.



మరొక హీరోయిన్స్ సమంత.. ఏంమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత అదే సినిమాలో నటించిన నాగచైతన్యను ప్రేమించి కొన్నేళ్లు డేటింగ్ చేసి..ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట కొన్ని కారణాల చేత విడిపోయారు. విడాకులు తీసుకున్న రెండేళ్లకు నాగచైతన్య మరొక హీరోయిన్ శోభితను  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ సమంత కూడా ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమోర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు  వినిపిస్తున్నాయి.


మరొక హీరోయిన్ నిహారిక కొణిదెల. బ్రదర్ నాగబాబు కూతురి గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువులైన చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. వివాహమైన మూడేళ్లకి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిర్మాతక కెరియర్ మీద ఫోకస్ పెట్టిన నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తనకు నచ్చిన వరుడుతోనే రెండో పెళ్లి ఉంటుందంటూ నాగబాబు ఇటీవలే తెలిపారు. వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ తో కొన్నేళ్లపాటు ప్రేమాయణం నడిపి పెళ్లి వరకు వెళ్లాలనుకున్న అది కుదరలేదు. అయితే తాను మాత్రం ఖచ్చితంగా మరో వివాహం చేసుకుంటానని చెప్పింది మలైకా అరోరా.

మరింత సమాచారం తెలుసుకోండి: