
మూడుసార్లు రిజెక్ట్ చేసి మళ్లీ ఓకే చేసి బిగ్ చెత్త ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న చరణ్.. ఆ సినిమా ఇదే..!

ఆ లిస్టులో మన రామ్ చరణ్ కూడా ఉన్నారు. గ్లోబల్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బిగ్ స్టార్ . బాగా నటిస్తాడు. బాగా మాట్లాడుతాడు . బాగా డాన్స్ చేస్తాడు . అందరితో కలిసి ఉంటారు . ప్రజెంట్ పెద్ది సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . కాగా రామ్ చరణ్ తన కెరీయర్ లో కొన్ని ప్రాప్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు . అందులో మరీ ముఖ్యంగా ఎప్పటికీ గుర్తుండిపోయేది "ఆరెంజ్" మూవీ .
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయింది . అభిమానులను అట్రాక్ట్ చేయలేకపోయింది . ఈ సినిమా కథ విన్నప్పుడు ఒకటికి మూడుసార్లు రామ్ చరణ్ బాగా ఆలోచించారట. మూడుసార్లకు పైగా ఈ సినిమా వద్దులే వద్దులే అంటూ రిజెక్ట్ చేశారట. మళ్లీ ఇలాంటి క్యారెక్టర్ వస్తుందో..? లేదో..? లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ అవుతుందో లేదో అన్న కారణంగా ఓకే చేశారట. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. రాంచరణ్ నటనకు బాగా మార్కులు దక్కిన కథ మాత్రం ఫ్లాప్ అయింది. రామ్ చరణ్ కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో జెనీలియ హీరోయిన్ గా నటించింది..!!