ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సక్సెస్ సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు ది 100 సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఐపిఎస్ ఆఫీసర్ విక్రాంత్‌ క్యారెక్టర్ లో ఆర్కే సాగర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. మిషా నారంగ్, ధన్య బాలకృష్ణన్ అభినయానికి సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దర్శకుడు  రాఘవ్ ఓంకార్ శశిధర్ తొలి  సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకోవడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.    పోలీస్ డ్రామాగా తెరకెక్కిన  ది  100 మూవీకి దక్కుతున్న ఆదరణ విషయంలో  దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సంతోషం వ్యక్తం చేశారు.  ది 100 మూవీ  పోలీస్ కథ మాత్రమే కాదని  భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన  కథ అని ఆయన చెప్పుకొచ్చారు.

నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోరాటం చేసే విధానాన్ని ఈ సినిమాలో చూపించమని ఆయన కామెంట్లు చేశారు.   థియేటర్లలో సినిమాను చూసి, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు.  ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని  అన్నారు.

ఆర్కే సాగర్ పోషించిన ఐపిఎస్ ఆఫీసర్ విక్రాంత్‌ క్యారెక్టర్ కు  ఎంత మంచి అప్లాజ్ వస్తుందో మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలకు కూడా మంచి గుర్తింపు దక్కిందని తెలిపారు.  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అంజనా దేవి గారు, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి  ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయని వెల్లడించారు.   నా తొలి చిత్రానికి ఇంత ప్రోత్సాహం వచ్చినందుకు తాను కృతజ్ఞుడినని ఆయన అన్నారు.  ఈ ప్రయాణంలో అండగా నిలిచిన నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్‌కే సాగర్‌లకు కృతఙ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు.  ఈ సినిమా  విజయం కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులకు ముందుకు రావాలనుకుంటున్నానని దర్శకుడు శశిధర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: