మెడలో నగలు ఎవరు వేసుకుంటారు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆడవాళ్లు మాత్రమే.ఆడవాళ్లు అంటే ఆభరణాలు.. ఆభరణాలు అంటే ఆడవాళ్లు అనేలా ఈ రెండింటి మధ్య విడదీయలేని అనుబంధం ఉంటుంది.ఆడవాళ్లకు ఆభరణాలు చూస్తే ఒక రకమైన పిచ్చి ఆకర్షణ వంటి ఉంటాయని అంటూ ఉంటారు. అంతేకాదు చాలామంది ఆడవాళ్ళకి నగల పిచ్చి బట్టల పిచ్చి ఉంటుందని కూడా అంటా ఉంటారు. పక్కింటి వారు ఎదురింటి వారు ఏదైనా నగ కొనుక్కొని వారి మెడలో కనిపిస్తే కచ్చితంగా ఆ నగ మా మెడలో కూడా కనిపించాలి అనుకుంటారు. ఆడవాళ్ళకి నగలు అంటే చెప్పలేనంత ఇష్టం. అయితే అలాంటి నగలు వేసుకోవడం కేవలం ఆడవాళ్ల హక్కే అనుకుంటారు.

 కానీ మొదటిసారి ఓ హీరో తన మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకొని అందరికి షాక్ ఇచ్చారు.ఆయన డైమండ్ నెక్లెస్ పెట్టుకొని మురిసిపోతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొట్టడంతో ఇదేంటి ఈ హీరో ఏమైనా తేడానా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ మెడలో నగలు వేసుకొని అమ్మాయిలా మురిసిపోతున్న ఆ హీరో ఎవరయ్యా అంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఏంటి మోహన్ లాల్ అమ్మాయిల లాగా నగలు వేసుకుంటున్నారా.. ఇదెక్కడి వీడియో రా మామ.. చూస్తేనే ఆశ్చర్యపోయేలా ఉంది అంటున్నారు. అయితే తాజాగా మోహన్లాల్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తోంది.ఆ వీడియోలో మోహన్లాల్ ఓ ఈవెంట్ కి వెళ్లి ఓ అమ్మాయి మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చూసి మోజు పడతారు.

 అయితే దాన్ని ఎలాగైనా కొట్టేయాలని ఆలోచించి చివరికి దొంగలించి తన కేరావాన్ లోకి పట్టుకొని పోతారు.ఆ తర్వాత ఆ డైమండ్ నెక్లెస్ ని మెడలో వేసుకొని చేతి వేళ్లకు డైమండ్ రింగు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని తెగ మురిసిపోతూ ఉంటాడు.అయితే ఇంతలోనే డైమండ్ నెక్లెస్ ఎవరో కొట్టేశారు అంటూ మైక్ లో అనౌన్స్మెంట్ వస్తుంది.అయినా కూడా పట్టించుకోరు. కానీ మోహన్లాల్ కేరవాన్ లో కి వెళ్లడం చూసిన ఓ వ్యక్తి వచ్చి మోహన్లాల్ ఏం చేస్తున్నాడని చూడడంతో ఆయన మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకొని మురిసిపోవడం చూసి షాక్ అయిపోతాడు. ఆ తర్వాత మోహన్లాల్ గట్టిగా నవ్వేస్తాడు. దీంతో వీడియో ముగిసింది. 

అయితే ఇదంతా విన్స్ మేరా జువెల్లరీ యాడ్ ప్రమోషన్ లో భాగంగా మోహన్లాల్ ఇలా చేశారని అనిపిస్తుంది. ఇక ఈ యాడ్ చూస్తే విన్స్ మేరా డైమండ్ జ్యువెల్లరీని చూస్తే ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఆకర్షితులవుతారు అనే ఉద్దేశంతో ఇలా మోహన్లాల్ తో యాడ్ చేపించారు. ఇక ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి మోహన్లాల్ ఏమైనా గే నా అమ్మాయిలు చేయవలసిన యాడ్లు ఈయన చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొంతమంది మోహన్లాల్ ఫ్యాన్స్ నగలు ఆడవాళ్లే వేసుకోవాలా.. పురాణాల్లో మగవాళ్ళు వేసుకోలేదా.. అలాగే మా హీరో కూడా వేసుకున్నారు ఇందులో తప్పేముంది అంటూ సమర్ధిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: