ఇది నిజంగా రాజమౌళి అభిమానులకి బిగ్ బిగ్ బిగ్  సర్ప్రైజ్ అనే చెప్పాలి . రాజమౌళి ఏ ప్రాజెక్టు చేసిన సరే మూడేళ్లు మినిమం టైం తీసుకుంటాడు.  అలాంటి రాజమౌళి - మహేష్ బాబుతో సినిమా అంటే చాలామంది ఎక్కువ టైం పడుతుంది అని ట్రోల్ కూడా చేశారు . కొంతమంది సినిమా రిలీజ్ అవ్వాలి అంటే ఒక 5 ఏళ్ల అయినా పడుతుంది అంటూ ఘాటుగా మీమ్‌స్ క్రియేట్ చేసారు . కానీ మహేష్ బాబు - రాజమౌళి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు . అనుకున్న టయానికి కరెక్ట్ గా రిలీజ్ చేస్తామంటూ షూటింగ్ షెడ్యూల్ చకచక ముందుకు తీసుకెళ్తున్నారు .


అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్  అవుతుంది . మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడట . ఆయన మరెవరో కాదు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ . పుష్ప2 సినిమాతో ఎవ్వరు అందుకోలేని స్థాయిని రీచ్ అయిన అల్లు అర్జున్ ప్రెసెంట్ అట్లీ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు . అయితే ఈ సినిమాకి కొంచెం బ్రేక్ చెప్పి ఒక యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ ఒక ఇంటర్నేషనల్ యాక్ కి కమిట్ అయ్యాడు అని ..ఆ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు అని.. ఆ యాడ్ ని డైరెక్ట్ చేయబోయే ఛాన్స్ సుకుమార్ కొట్టేసిన్నట్లు తెలుస్తుంది .



అయితే ఇప్పుడు మరొక యాడ్ ని ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అల్లు అర్జున్ ఒక ప్రతిష్టాత్మకమైన బ్రాండెడ్ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేయబోతున్నారట . దీనికోసం మేకర్స్ అల్లు అర్జున్ - రాజమౌళిని చూస్  చేసుకున్నారట . రాజమౌళి యాడ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు అన్న వార్త ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ తో పాటు రాజమౌళి కూడా ఒక్క సెకండ్ అలా క్లిప్ లో యాడ్ లో కనిపించబోతున్నారట. అన్ని పక్కగా కుదిరితే మహేష్ బాబు కంటే ముందే అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు .  చూడాలి మరి ఇది రాజమౌళికి ఏ విధమైనటువంటి ఇమేజ్ ని తెచ్చి పెడుతుందో ..?? చాలామంది అల్లు అర్జున్ - రాజమౌళి లాంబోలో సినిమా రావాలి అంటూ వెయిట్ చేస్తున్నారు . సినిమా రాకపోయినా యాడ్ అయినా వస్తే చాలులే అని ఆనందపడే జనాలు కూడా ఉన్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: