
రెండు కిడ్నీలు చెడిపోయి నెల రోజుల క్రితం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని.. అందుకు 50 లక్షలు రెడీ చేసుకోమని వైద్యులు సూచించారు. అంత స్తోమత ఫిష్ వెంకట్ కుటుంబానికి లేదు. ఈ క్రమంలోనే వెంకట భార్య, కూతురు మీడియా ముందుకు వచ్చి తమకు సాయం చేయాలంటూ టాలీవుడ్ ప్రముఖులను వేడుకొన్నారు. కానీ ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ ముందుకు రాలేదు. కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు కూడా ఆయన వంక కన్నెత్తి చూడలేదు. నెల రోజుల పాటు ఫిష్ వెంకట్ కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురుచూసిన.. వారికి నిరాశే ఎదురయింది. ఇంతలో ఆరోగ్యం మరింత క్షణించి ఫిష్ వెంకట్ కన్నుమూశారు.
మా నాన్నను హాస్పిటల్ లో చేర్చినప్పుడై ఎవరైనా ఆర్థిక సహాయం చేసి ఉంటే ఆపరేషన్ జరుగుండేదని, కచ్చితంగా ఆయన బతికేవారని వెంకట్ కూతురు తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ నుంచి హీరో విశ్వక్ సేన్, జెట్టి ఫేమ్ కృష్ణ మావినేని మాత్రమే సహాయం చేశారని ఆమె తెలిపింది. రామ్ చరణ్ కు చెందిన క్లిన్ కారా ఫౌండేషన్ నుంచి రూ. 25 వేలు సహాయం అందించారని.. కానీ కొందరు రామ్ చరణ్ మా నాన్నను మంచి హాస్పిటల్ లో చేర్పించి భారీ ఆర్థిక సహాయం చేశారంటూ పుకార్లు లేపారు. దానివల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విరాళం రాలేదని.. డబ్బు లేకపోవడం వల్లే మా నాన్నను కోల్పోయామని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మంచు విష్ణుతో సహా చాలా మందికి కాల్ చేశామని.. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదని.. చివరకు మా నాన్న చనిపోయిన గబ్బర్ సింగ్ టీమ్ తప్ప ఎవ్వరు చూడడానికి రాలేదని వెంకట్ కూతురు వాపోయింది. కాగా, ఈ ఘటనతో టాలీవుడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్లోబర్ స్టార్ అయ్యుండి రామ్ చరణ్ రూ. 25 వేలు ఇవ్వడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.