
ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా టైటిల్ పాత్రను పోషిస్తే.. ఆయనకు ధీటుగా భల్లాల దేవా పాత్రలో రానా దగ్గుబాటి చెలరేగిపోయాడు. ఈ ఇద్దరు హీరోలు సినిమాకు మెయిన్ పిల్లర్స్ అయ్యారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. భల్లాల దేవా పాత్ర కోసం రానాతో పాటుగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ తనయుడ్ని కూడా రాజమౌళి సంప్రదించారట. ఇంతకీ అతను మరెవరో కాదు నిహార్ కపూర్. జయసుధ కుమారుడీయన.

కానీ లాస్ట్ మినిట్‌లో రానా రావడంతో.. రాజమౌళి అతనికే ఓటు వేశాడు. ఇక అప్పుడు నిహార్ కపూర్ కు కాలకేయ పాత్రను ఆఫర్ చేశారట. ఆ పాత్రకు సంబంధించి కొన్ని స్కెచెస్ కూడా చూపించారట. కానీ నిహార్ కపూర్ ఈసారి నో చెప్పాడు. ఆ పాత్రకి ఫేస్ సరిగ్గా కనిపించదు. జయసుధ కూడా మొదటి సినిమాలో ఫేస్ కనిపించకుండా ఎందుకు వద్దు అన్నారట. అందుకే బాహుబలి మూవీని వదులుకున్నానని తాజా ఇంటర్వ్యూలో నిహార్ కపూర్ వెల్లడించారు.