ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా నిలిచిన క్రీడాకారుల్లో సచిన్ ఒకరు. ఈయన కెరియర్ లో ఎన్నో రికార్డులు ఉన్నాయి.. అలాంటి సచిన్ టెండుల్కర్ క్రికెట్ లోనే కాకుండా ప్రేమ వ్యవహారాల్లో కూడా ముందున్నారు.. ముఖ్యంగా చాలామంది సినీ హీరోయిన్ల కు క్రికెటర్ల కు మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తూ ఉండడం కామన్..ఆ విధంగానే 90 లో  సచిన్ టెండూల్కర్ శిల్పా శిరోద్కర్ మధ్య ప్రేమ ఉందని వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ మహారాష్ట్ర కు  చెందిన వారు కావడంతో  ఇద్దరి మధ్య బంధం ఉందని పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై  శిల్పా శిరోద్కర్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. 

1991లో హం అనే చిత్రం షూటింగ్ సమయంలో సచిన్ ను ఫస్ట్ టైం  కలిశానని చెప్పింది. అయితే సచిన్ ఉండే ఏరియా లోనే మా కజిన్ కూడా ఉండేవారని, వారిద్దరూ కలిసి క్రికెట్ బాగా ఆడేవారని అలా సచిన్ తో నాకు పరిచయం ఏర్పడిందని అన్నది. కానీ మేము ఒకరిని ఒకరు అర్థం చేసుకునే సమయం లోపే  సచిన్ అంజలి తో ప్రేమలో పడ్డారని తెలిపింది. ఈ విషయం నాకు తెలియలేదని అన్నది.

నేను హీరోయిన్ ఆయన స్టార్ క్రికెటర్ కాబట్టి మేము ఒకసారి కలవగానే వాళ్ళు కథలు అల్లేసి మా మధ్య ప్రేమ ఉందని వార్తలు రాసుకోచ్చారు. కానీ అదంతా అబద్ధం  సచిన్ అంజలి తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నారు.. అయితే ఈ రూమర్లపై సచిన్ కూడా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.. అసలు శిల్పా ఎవరో నాకు తెలియదని, మా మధ్య అలాంటిదేమీ లేదని వచ్చిన వార్తలన్నీ పుకార్లు అంటూ కొట్టి పడేశారు.. ఇక శిల్పా శిరోద్కర్ మహేష్ బాబుకు మరదలు  అవుతుంది. ఆయన భార్య నమ్రతాకు శిల్ప చెల్లి అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: