
దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ సినిమా షూటింగ్ సెట్స్ లో ఆయన పాల్గొన్న పిక్చర్స్ వీడియోస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వస్తున్నాయి . తాజాగా ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బన్నీ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసాడు అంటూ ఈ మలయాళి నటుడు అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారణ్ ని చూస్ చేసుకున్నారట అట్లీ . బన్నీ కూడా అందుకు ఓకే చెప్పారట . పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ కథ విని ఇంప్రెస్ అయ్యి కాల్ షీట్స్ ఇచ్చేసారట .
త్వరలోనే ముంబైలో జరగబోతున్న ఈ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ అని అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . దీంతో ప్రశాంత్ నీల్ అదేవిధంగా రాజమౌళి ను కాపీ కొడుతున్నాడు అట్లీ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మరికొందరు మాత్రం ఎవరి థాట్స్ వాళ్ళవి ఎవరి ఒపీనియన్ వాళ్ళది .. పృథ్వీరాజ్ సుకుమారన్ - అల్లు అర్జున్ సినిమాలో నటిస్తే బన్నీ కన్నా కూడా ఆయనే హైలెట్ అవుతాడు . ఆయన బాడీ ఆయన కటౌట్ ఆయన రేంజ్ అలాంటిది అంటూ మలయాళీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పైగా అల్లు అర్జున్ కి కేరళలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడు అదే మలయాళీ హీరోతో అల్లు అర్జున్ ఫైట్ చేస్తే జనాలు ఏ విధంగా తీసుకుంటారో..?? అట్లీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..!!???