పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత హీరోగా థియేటర్లోకి వచ్చిన మూవీ హరిహర వీరమల్లు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్లో చూడ్డానికి చాలా రోజులు నుండి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానుల ఆసక్తికి తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ చివరికి జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఒకరోజు ముందే అనగా జూన్ 23న యూఎస్ లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షోస్ చూసిన చాలా మంది జనాలు పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని చూసిన చాలామంది జనాలు థియేటర్ నుండి నవ్వుకుంటేనే సినిమా బాగుంది అనే టాక్ తోనే వస్తున్నారు. కానీ కొంతమంది నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. మరి ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ప్లస్లు,మైనస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 హరిహర వీరమల్లు మూవీ ప్లస్ లు..
 పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద ప్లస్. ఇయన్నీ చూడడం కోసం అయినా సరే ఒక్కసారి సినిమాకి రావచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ ని తెర మీద చూడడం కోసం ఓసారి సినిమా చూడవచ్చు. సినిమా ఎబో యావరేజ్ అని చెప్పవచ్చు.. ఇక పవన్ కళ్యాణ్ నటన కీరవాణి మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. అలాగే ఫస్టాఫ్ సినిమా అద్భుతంగా ఉంది.. విలన్ పాత్రలో నటించిన బాబి డియోల్ పాత్ర కూడా సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సనాతన ధర్మం అనే అంశాన్ని బాగా వాడుకోవడం వల్ల బీజేపీ అభిమానులను ఈ సినిమా మెప్పిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిందువు ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేసిన సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా ఉంది.అలాగే తెరమీద పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది

 హరిహర వీరమల్లు మూవీ మైనస్లు :
 హరిహర వీరమల్లు మూవీకి పెద్ద మైనస్ సెకండాఫ్.. అలాగే జ్యోతి కృష్ణ డైరెక్షన్.. పవన్ కళ్యాణ్ తో క్రిష్ తెరకెక్కించిన సీన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి.కానీ జ్యోతి కృష్ణ తెరకెక్కించిన సీన్స్ చాలా పూర్ గా ఉండడంతోపాటు జ్యోతి కృష్ణకి ఎక్కువగా దర్శకత్వ అనుభవం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కథ చూస్తే అద్భుతంగా ఉంది. కానీ సినిమాని జ్యోతి కృష్ణ మాత్రం హ్యాండిల్ చేయలేకపోయారు. ఇక సెకండాఫ్ పూర్తిగా హిందూ ధర్మం పరిరక్షణ నేపథ్యంలోనే సాగుతుంది. అలాగే కొన్నిచోట్ల సాగదీత సీన్లు ఉండడం, పాత్రలు సింక్ లేకపోవడం వంటివి సినిమాకి మైనస్ ఇక మరో అంశం పూర్ విఎఫ్ఎక్స్,స్క్రీన్ ప్లే.. క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ పై హింట్ ఇస్తూ సినిమా ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: