
ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ఈ మూవీ ప్రమోషన్ లో పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ లో రాబోతున్న తన తదుపరి సినిమా ‘ఓజీ’ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్ లో ‘ఓజీ’ అంటూ అభిమానులు చేసిన కామెంట్స్ పవన్ ను కూడ ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నం సైతం కొంతవరకు ఆవేదన చెందారు. ‘ఓజీ’ టైటిల్ క్యాచీగా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అరవడానికి ఒక కారణమని రత్నం విశ్లేషిస్తే దర్శకుడు జ్యోతికృష్ణ మాత్రం ‘ఓజీ’ యాక్షన్ మూవీ కావడం దాని టీజర్ ఆకట్టుకోవడం వల్ల హైప్ పెరిగిందని ఓపెన్ గానే చెప్పిన విషయం తెలిసిందే. ఈవిషయం పై పవన్ కళ్యాణ్ మాత్రం వేరేవిధంగా స్పందించారు.
ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా హింసను ఇష్టపడుతున్నారని పవన్ తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఒకప్పుడు హీరో అంటే మంచి వాడే అయి ఉండాలని ధర్మాన్ని పాటించాలని అనుకునేవాళ్లని రాముడిని ఆదర్శంగా తీసుకునేవారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవనీ పవన్ అభిప్రాయం. ప్రేక్షకులు హీరోలో నెగెటివ్ షేడ్స్ ను ఎక్కువ ఇష్టపడుతున్నారని అలా ఉన్న పాత్రలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందని పవన్ అభిప్రాయ పడ్డారు.
‘హరి హర వీరమల్లు’ ఫలితం తెలిపోవడంతో ఇక పవన్ అభిమానుల ఆశలు అన్నీ ‘ఓజీ’ పైనే ఉన్నాయి అనుకోవాలి..